శ్రీ వన మహాలక్ష్మి ఆలయ రత్న కప్పు ప్రతిష్ఠ

*శ్రీ వన మహాలక్ష్మిదేవి ఆలయ నిర్మాణంలో కీలక ఘట్టం*
శ్రీ వన మహాలక్ష్మిదేవి ఆలయ నిర్మాణ దాతలకు మరియు అన్ని గ్రామాల ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి.....
రేపు అనగా శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల మధ్యలో ఆలయ నిర్మాణంలో కీలక ఘట్టం అయిన ఆలయ గోపురం యొక్క రత్నకప్పు వేయడానికి పండితులు మరియు పెద్దలు నిర్ణయించారు. కావున ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ సమయంలో రాగి రేకు పైన మీ కుటుంబ సభ్యుల పేర్లు మరియు గోత్రము రాసి సిద్ద పరచగలరని మనవి. ఈ రాగి రేకు ఆలయ గోపురంపై రత్నకప్పులో శాశ్వతంగా ఉండే అవకాశం ఉన్నందున ఈ మహాద్భుతమైన అవకాశాన్ని భక్తులు అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి.
రత్నకప్పు నుండి ఆలయ గర్భంలోకి జారవిడుచుటకు భక్తులు అందరూ ధాన్యం తప్పనిసరిగా తీసుకుని రాగలరని ప్రార్థిస్తున్నాం. అలాగే నవధాన్యాలు మరియు వంటకాలు కూడా రత్నకప్పు నుండి జారవిడిచిపెట్టడం జరుగుతుందని తెలియపరుస్తున్నాము.
ఈ అద్భుతమైన కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం అయి లక్ష్మీదేవి కరుణా కటాక్షం పొందగలరని ఆహ్వానిస్తున్నాము.
దీనినే వ్యక్తిగత ఆహ్వానంగా భావించాలని విజ్ఞప్తి.
ఇట్లు
ఆలయ కమిటీ సభ్యులు
గ్రామస్థులు
గూనబద్ర R&R కాలనీ.
Video Summary
AI GeneratedThe video captures the inauguration of the Vanamaha Lakshmi temple, an event drawing people from various locations. The footage highlights the community's collective effort, featuring the village Sarpanch, committee members, and local devotees who worked hard to complete the temple construction.
