hair care in rainy season

MMS Designer
MMS Designer
Sep 11, 2026

Hello Viewers Welcome to MMS Designer.
• వర్షాకాలం అనేది అన్ని ఋతువులలో కల్లా ఎంతో ప్రత్యేకమైనది, అంతే కాకుండా ఎన్నో ప్రత్యేకతలతో కూడినది, ఈ కాలంలో తడితనం అంటే తేమ ఎక్కువగా ఉంటుంది.దీని వల్ల మీ జుట్టుకి చుండ్రు పట్టే అవకాశాలు ఎక్కువ.ఈ చుండ్రు వల్ల మన జుట్టే కాదు మంచి అందం కుడా పాడైపోతుంది.
• వర్షాకాలంలో వర్ష శాతం ఎక్కువగా ఉండడం వల్ల మీ జుట్టుని తడవనివ్వకండి,ఎక్కువగా తడిస్తే మీ జుట్టూ పాడైపోయే ప్రమాదం ఉంటుంది.మీ జుట్టుని కాపాడుకోవడానికి “గొడుగులు”,”Caps” ఉపయోగించండి.
• ఒకవేళ అనుకోని పరిస్తితుల్లో మీ జుట్టూ తడిచిపొయినట్లయితే వీలైనంత త్వరగా తుడుచుకుని ఆరబెట్టుకోండి.
• వారంలో 2-3 సార్లు తలస్నానం చేయండి, అలా చేయడం వల్ల మీ జుట్టు మొదళ్ళు శుబ్రముగా వుండి, ఏరకమైన జుట్టుకి సంబందించిన వ్యాదులు(చుండ్రు,ఫంగస్”) సోకవు.
• మీ జుట్టుని సాద్యమైనంతవరకు తడిగా ఉండనివ్వరాదు,అలా ఉన్నప్పుడు గట్టిగా కట్టకూడదు.
• అందమైన, మెరిసే జుట్టు కోసం “హెయిర్ కండిషనర్లు” ఉపయోగించండి.
• ఎక్కువ శాతం నీరు,పళ్ళ రసములు తాగడం మంచిది.
• ఈ కాలంలో కొద్ది కొద్దిగా జుట్టు వూడిపోవడం సహజం, కంగారుపడనవసరం లేదు, “హెయిర్ కర్లింగ్”,మొదలగు విధానాలు మానుకోవడం మంచిది, వీటి వల్ల జుట్టు పాడైపొయే అవకాశం ఎక్కువ.
• ఒకవేళ మీకు తీవ్రమైన సమస్యలు తలెత్తితే, చర్మానికి లేదా జుట్టుకి సంబందించిన వైద్యుల్న్ని (dermatologist or trichologist)సంప్రదించడం ఎంతో మంచిది.