Staying Safe During Mosquito Season( In Telugu)

Hello Viewers Welcome To MMS DESIGNER.
సాధారణంగా జూన్, జూలై మాసాలలో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉండడంతో నిల్వ ఉన్న నీటి నుంచి దోమలు ఉత్పత్తి అవుతాయి. దోమ కాటుకు గురివావడం వలన మలేరియా జ్వరం సంభవిస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. దోమ కాటు వల్ల జ్వరం లేదా మలేరియా రావొచ్చు.
ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా వర్గానికి చెందిన పరాన్న జీవి వలన మలేరియా జ్వరం వస్తుంది. దీనిలో అత్యంత ప్రమాదకరమైన ప్లాస్మోడియం ఫాల్సిపేరం అనే పరాన్న జీవి వలన వచ్చు సెరెబ్రల్ మలేరియావ్యాధితో మరణాలు ఎక్కువగా సంభవించే అవకాశముంటుంది. రొనాల్డ్‌రాస్ అను శాస్త్రవేత్త వివరించిన ప్రకారం మలేరియా జ్వరం ఒకరి నుంచి మరొకరికి వ్యాపింప చేయుటలో ఆడ ఎనాఫిలస్ దోమ కీలక పాత్ర వహిస్తుంది.
దోమలు కుడితే ఎంతటి ప్రాణాంతక విష జ్వరాలు ప్రబలుతాయో అందరికీ తెలిసిందే. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలకు దోమలే కారణం. అతి ప్రమాదకరమైన అంటు వ్యాధులను సూది లాంటి తన ముక్కుతో అలా కుట్టి.. ఇట్టే వ్యాపింప చేసి ప్రజలను పరలోక ప్రయాణానికి సిద్ధం చేసేస్తుంది. ఇటువంటి దోమకు యావత్ ప్రపంచం మొత్తం శత్రువులే..! అయితే మన టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఈ దోమలను నివారించడంలో మాత్రం పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోతున్నాం. ప్రస్తుతం దోమలను నివారించడానికి చాలా పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ.. ఏదీ పూర్తి స్థాయిలో పనిచేయక పోవడం దురదృష్టకర విషయం.
ఇక మన ఇళ్లలో సాధారణంగా వాడే దోమల కాయిల్స్, మస్కిటో రీపెల్లెంట్స్ కొందరికి పడవు. శ్వాసకోశ సమస్యలను తెచ్చి పెడతాయి. కాబట్టి, ఇంట్లో తయారుచేసుకునే ఒక సింపుల్ నేచురల్ రెమెడీతో ఇంట్లో దోమలన్నింటి నాశనం చేయవచ్చు. ఈ రెమెడీ స్ప్రే చేసిన రెండు గంటల్లోపు మంచి ఫలితం ఉంటుంది.
