Alert women's don't sleep less than men.

Hello Viewers Welcome To MMS DESIGNER.
పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఆధునిక యుగంలో నిద్ర బాగా కరువైంది. ఇంటి పనులు, ఆఫీసు పనులు చూసుకుంటూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోని మహిళల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. కుటుంబం కోసం కార్యాలయాల్లో పని పూర్తి చేసుకుని.. ఇంట్లోనూ పనులు చక్కబెట్టుకుని నిద్రపోయేందుకు పదో, పదకొండో కావచ్చు. ఇక శరీరం అలసిపోయింది హాయిగా నిద్రపడుతుందిలే అనుకునే మహిళలు కంటిపై నిద్రలేకుండా బాధపడుతున్నారు.
ఒత్తిడి, ఆందోళన కారణంగా పడుకున్న వెంటనే మహిళలు నిద్రలోకి జారుకోవట్లేదు. భర్త, పిల్లలు, ఆర్థిక పరిస్థితి, కార్యాలయ ఒత్తిడి వంటి ఇతరత్రా సమస్యలన్నీ నిద్రించేందుకు ముందు వారి కంటి ముందు నిలబడితే.. ఇక నిద్రలేమి సమస్య వేధించక మానట్లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయం పరిశోధనల్లోనూ తేలిందని చెప్తున్నారు. నిద్రలేమి సమస్య పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువని పరిశోధకులు చెప్తున్నారు.
నిద్ర మనిషి ఆరోగ్యాన్ని డిసైడ్ చేసే ఒక చర్య. ఈరోజుల్లో పనికి అలవాటు పడి నిద్రను నిర్లక్ష్యం చేస్తూ అనేక రకాల ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు చాలామంది. అయితే.. పురుషులు, స్త్రీల నిద్ర విషయానికొస్తే.. మగవారి కంటే ఆడవారికి 20 నిమిషాల నిద్ర అదనంగా అవసరమట. పిల్లలకు, వృద్ధులకు 10 గంటలు, యువకులు, మధ్యవయసు వారికి 8 గంటల నిద్ర కనీసం అవసరం. కానీ.. స్త్రీ, పురుషుల నిద్ర సమయాల విషయంలో మాత్రం ఇది కాస్త భిన్నం. పురుషుల కంటే స్త్రీలు రోజుకు 20 నిమిషాలు అదనంగా నిద్రించాలట. లేదంటే కొన్ని సమస్యలు తప్పవు అంటున్నారు పరిశోధకులు.
