simple home remedy teeth whitener

Hello Viewers welcome to MMS DESIGNER.
మనిషి ముఖంలో మరో అందమైన భాగం అందమైన దంతాల వరుస ఎంతో అందంగా ఉంటుంది. అయితే దంతాలు అందంగా ఉన్నా, పళ్ళు పచ్చగా గార పట్టి ఉంటే పదిమందిలో హాయిగా నవ్వలేము. అందుకే, ఎప్పుడూ పళ్ళను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా దంత వైద్యుడి ను కలుస్తుంటారు. చాల మంది రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిళమిళలాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి. అయితే మరొకొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత తెల్లగా కనబడవు, పసుపుపచ్చగా గార పట్టి కనబడుతుంటాయి. అటువంటి వారి కోసమే ఈ పోస్ట్….
మరి ఈ సమస్యకు పరిష్కారం మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే కేవలం 3,4 నిమిషాల్లోనే మీ దంతాలను తెల్లగా మిలమిళ మెరిసేలా చేయవచ్చు. పచ్చగా ఉన్న దంతాలను తెల్లగా కనిపించేలా చేసేందుకు కేవలం ఈ రెండు పదార్థాలను తీసుకుంటే చాలు.మీ పళ్ళకి పట్టిన గార తొలగిపోతుంది.
అందులో మొదటిది బేకింగ్ సోడా, మరియు నిమ్మరసం. ఒక చిన్నపాటి బౌల్లో ఒక స్పూన్ బేకింగ్ సోడాను తీసుకోవాలి. దానికి సగం నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని కొద్ది కొద్దిగా కలపాలి. చివరకు బేకింగ్ సోడా నిమ్మరసంలో పారదర్శకంగా కరిగి ఓ ద్రావణంలా తయారవుతుంది. ఈ ద్రావణంలో కొద్ది భాగాన్ని చేతి వేలిపై తీసుకుని దాంతో దంతాలపై బ్రష్ చేసినట్టు చేయాలి. అనంతరం నీటితో నోటిని పుక్కిలించాలి. అంతే, క్షణాల్లోనే దంతాలు తెల్లగా మారిపోవడం ఖాయం ఇంకెందుకు ఆలస్యం వెంటనే పని ప్రారంభించండి
